ఏసీబీ వలలో మరో అవినీతి చేప..
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.). రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం కేసులో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (లైన్ మెన్) ప్రభులాల్ను పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కరెంట్ కనెక్షన్, మీట
Acb


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.).

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం కేసులో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (లైన్ మెన్) ప్రభులాల్ను పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కరెంట్ కనెక్షన్, మీటర్ మార్పిడి, బిల్లింగ్ సమస్య పరిష్కారం పేరుతో ఓ వ్యక్తి వద్ద రూ. 6,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు పన్నిన ఉచ్చులో ప్రభులాల్ లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సంబంధిత ఆధారాలను సేకరిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande