
భద్రాద్రి కొత్తగూడెం, 29 అక్టోబర్ (హి.స.) తుఫాన్ ఎఫెక్ట్ వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా
వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగానే బుధవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. వర్షంతో వరి, మొక్కజొన్న, పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున అటుగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తుఫాను వల్ల భారీ నుంచి అతి వారి వర్షం కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు