సీఎం చంద్రబాబు మంత్రి సంధ్యారానికి .ఫోన్ చేసి పార్వతీపురం.మన్యం జిల్లా పరిస్థితి పై.ఆరా
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)సీఎం చంద్రబాబు మంత్రి సంధ్యారాణికి ఫోన్‌ చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో పరిస్థితిపై ఆరా తీశారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోనసీమ
సీఎం చంద్రబాబు మంత్రి సంధ్యారానికి .ఫోన్ చేసి పార్వతీపురం.మన్యం జిల్లా పరిస్థితి పై.ఆరా


అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)సీఎం చంద్రబాబు మంత్రి సంధ్యారాణికి ఫోన్‌ చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో పరిస్థితిపై ఆరా తీశారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోనసీమ ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచనలిచ్చారు. కృష్ణాజిల్లాలో మంత్రులు వాసంశెట్టి సుభాష్‌, కొల్లు రవీంద్ర సమీక్ష జరిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి గొట్టిపాటి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఏలూరు జిల్లాలో మంత్రి పార్ధసారధి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కొండపల్లి మత్స్యకారులతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో మంత్రి స్వామి సింగరాయకొండ మండలంలో పర్యటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande