మొంథా తుపాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స) తుఫాన్ ప్రభావం పై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోల
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స) తుఫాన్ ప్రభావం పై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, గుండాతిమడుగు స్టేషన్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోవడం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తీవ్ర ప్రభావం ఉన్నచోట ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande