
సూర్యాపేట, 29 అక్టోబర్ (హి.స.) “మొంథా” తుఫాను కారణంగా సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం జిల్లాలోని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు