వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ భారీ వర్షాలు పడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుండగా డోర్నకల్ వర్ధన్నపేట మండలాల్లో 10 సెంటిమీటర్లకు పైగా వర్షం పడింది. ఈ వర్షానికి జనజీవనం అస్
వర్షాలు


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ భారీ వర్షాలు పడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుండగా డోర్నకల్ వర్ధన్నపేట మండలాల్లో 10 సెంటిమీటర్లకు పైగా వర్షం పడింది. ఈ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం కాగా ఆరు జిల్లాల పరిధిలో అలర్ట్ ప్రకటించారు. మొంథా తుఫాను వల్ల భారీ వర్షాలు పడుతుండటంతో మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ భారీ వర్షాలకు వరంగల్ నగరం పరిధిలో కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రోడ్లపైన, లోతట్టు కాలనిలో వరద నీరు చేరింది. రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లన్నీ బోసిపోయాయి. భారీ వర్షాలకు డోర్నకల్, మహబూబాబాద్ రైల్వేస్టేషన్ లలో వరద నీరు చేరడంతో గోల్కొండ, కోనార్ ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోయాయి.

ఉమ్మడి జిల్లాలో పడుతున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. ఏకధాటిగా వర్షం పడుతుండటంతో జిల్లా కలెక్టర్లు, అధికారులందరూ విధుల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. సెలవులను రద్దు చేశారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande