
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
అమరావతి: మొంథా తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3 వేలు అందజేయాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేముందు ఈ నగదు ఇవ్వనున్నారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. (
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ