
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తుపాను బాధిత కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. నిత్యావసర సరుకుల పంపిణీపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ