రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు.. గోల్కొండ, కోణార్క్, కృష్ణా ఎక్స్ప్రెస్లు నిలిపివేత
మహబూబాబాద్, 29 అక్టోబర్ (హి.స.) ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీన పడుతున్న మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట
వర్షాలు


మహబూబాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీన పడుతున్న మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వర్షపునీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మొంథా తూఫాన్ కారణంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో వరద నీరు భారీగా రైల్వే స్టేషన్ లోకి వచ్చి చేరుతోంది. అయితే మహబూబాబాద్, గార్ల, గుండ్రాతి మడుగు, డోర్నకల్ జంక్షన్ లలో రైల్వే ట్రాక్ నీటిలో మునిగిపోవటంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లను జిల్లా పరిధిలోనే నిలిపివేశారు. డోర్నకల్ రైల్వే జంక్షన్ పూర్తిగా జలమయమవగా ఒకటో నెం ఫ్లాట్ ఫాం పైకి నీరు చేరింది. గోల్కొండ ఎక్స్ ప్రెస్, ఓ గూడ్స్ రైళ్లను డోర్నకల్ జంక్షన్ లోనే నిలిపి వేశారు. అదే విధంగా గుండ్రాతి మడుగులో కోణార్క్ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్లో కృష్ణా ఎక్స్ ప్రెస్, గార్ల సమీపంలో గూడ్స్ రైలును కూడా నిలిపివేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande