తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
తెలంగాణ, 29 అక్టోబర్ (హి.స.) ''మోంథా'' తుపాను కారణంగా తెలంగాణ పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా మం
భారీ వర్షాలు


తెలంగాణ, 29 అక్టోబర్ (హి.స.)

'మోంథా' తుపాను కారణంగా

తెలంగాణ పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా

మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్నగర్ డీఈవో ప్రవీణ్ కుమార్ ( జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో నేటి త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande