
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు మరోసారి సెలవులు పొడిగించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని తీర జిల్లాలు సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం తగ్గిన తరువాత వాతావరణ పరిస్థితులను సమీక్షించి, తరగతుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ