జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం షెడ్యూల్
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (BRS) జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా, ఆ పార్
కేటీఆర్


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (BRS) జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొనబోయే డోర్ టూ డోర్, రోడ్ షోలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 31న షేక్పేట్, నవంబర్ 1న రెహమత్నగర్, 2న యూసుఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో కేటీఆర్ డోర్ టూ డోర్ ప్రచారం కొనసాగనుంది. అదేవిధంగా నవంబర్ 8న షేక్పేట్, యూసుఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీ (Bike Rally)తో కేటీఆర్ ప్రచారం ముగియనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande