మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇటీవలే డీప్ ఫేక్, తన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలను వాణిజ్య ప్రకటనలకు వాడుకోవడంపై చిరంజీవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
చిరంజీవి


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్

చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇటీవలే డీప్ ఫేక్, తన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలను వాణిజ్య ప్రకటనలకు వాడుకోవడంపై చిరంజీవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని పేర్కొంటూ ఒక ఎక్స్ హ్యాండిల్ డీటెయిల్స్ తో కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చినా.. ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, వాయిస్, ఫొటోలను వాడి దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande