మొంథా తుపాన్.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) తుపాను కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇవాళ మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారు
మంత్రి సీతక్క


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

తుపాను కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇవాళ మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆదేశించారు. పలు చోట్ల రైళ్లు నిలిపివేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande