
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్ పై బుధవారం కారు ప్రమాదం జరిగింది. రహదారి పై కొద్ది సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిని స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ఆ ఘటనను గమనించి, కాన్వాయ్ను ఆపి గాయాలతో కారులో ఉన్నవారి పరిస్థితిని స్వయంగా సమీక్షించి సిబ్బందితో కలిసి ప్రమాదానికి గురైన కారును రహదారి పక్కకు తరలించారు. ట్రాఫిక్ సజావు చేయడానికి మంత్రి వాటికి శ్రీహరి ట్రాఫిక్ ను సరిచేశారు. ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. మంత్రి పదవీలో ఉన్నా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి, సేవా స్పూర్తిని మంత్రి చర్యలను అందరూ మెచ్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు