తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాను ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం
హైదరాబాద్ 29 అక్టోబర్ (హి.స.) : తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంట
चक्रवाती 2


హైదరాబాద్ 29 అక్టోబర్ (హి.స.)

: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది.. సాధారణంగా ఈ తుఫాన్ ఛత్తీస్గఢ్ వైపు కదలాల్సి ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు.. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ వైపు కదులుతోంది. మరో 12-24 గంటల్లో తుఫాన్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande