
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెంలో సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ నీటికి వర్షపు నీరు తోడవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పల్లిపాలెం గ్రామంలోకి నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అంతర్వేదిలో గాలి తీవ్రత అధికంగా ఉందన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడిన ‘మొంథా’ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ