భారీ వర్షాలు... నేరుగా రంగంలోకి దిగిన హైడ్రా, GHMC కమిషనర్లు
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) తుఫాన్ కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటూ హైదరాబాద్లోనూ ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న
వర్షాలు


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

తుఫాన్ కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటూ హైదరాబాద్లోనూ ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నేరుగా రంగంలోకి దిగారు. లక్షీకపూల్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారులపై నీరు నిలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లక్షీకపూల్ పైపు లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande