వేములవాడలో ఆటోమేటిక్ కెమెరాలు ప్రారంభం
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) వేములవాడ మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేస్తూ, వాహనాలను ఆటోమేటిక్ గా గుర్తించే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏ.ఎన్.పి.ఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని 5 చోట్ల ఏర్పాటు చసిన ఈ కెమెరాలను
రాజన్న జిల్లా ఎస్పీ


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

వేములవాడ మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేస్తూ, వాహనాలను ఆటోమేటిక్ గా గుర్తించే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏ.ఎన్.పి.ఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని 5 చోట్ల ఏర్పాటు చసిన ఈ కెమెరాలను బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డిలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కెమెరాలతో పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు, రాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వాహనాలను గుర్తించి స్కాన్ చేసి సంబంధిత వాహన యజమానులకు వెంటనే ఈ- చలాన్ జారీ చేయబడుతుందని అన్నారు. అట్లాగే ఈ కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడం, అనుమానిత వాహనాలను గుర్తించడం, నేర పరిశోధనలో వేగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని, అందుకే వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande