ఉమ్మడి పాలమూరును వణికిస్తున్న మొంథా తుఫాన్- ఎస్ఏ- 1 పరీక్షలు వాయిదా
మహబూబ్నగర్, 29 అక్టోబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్రత ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తుంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఓ మాదిరి వర్షం, చలి తీవ్రత, బుధవారం తెల్లవారుజామున నుండి మరింత తీవ్ర
పరీక్షలు వాయిదా


మహబూబ్నగర్, 29 అక్టోబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్రత ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తుంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఓ మాదిరి వర్షం, చలి తీవ్రత, బుధవారం తెల్లవారుజామున నుండి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ పరిస్థితుల ప్రభావం కారణంగా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలు, వృద్ధులు చలి, ముసురు కారణంగా ఏర్పడిన పరిస్థితులకు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రాంగణాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఎస్ఏ - 1 పరీక్షలను వాయిదా వేసినట్లుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులను ఎంఈఓ, ఎంపీడీవో, తహసీల్దార్ వాతావరణ పరిశీలించి పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డీఈవోలు పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande