
అచ్చంపేట, 29 అక్టోబర్ (హి.స.)
మొంథా తుఫాన్ కారణంగా
అచ్చంపేట నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చారకొండ మండలం తుర్కల పల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందవద్దనీ, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు