మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ABVP కార్యకర్తల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
కరీంనగర్, 29 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రచ్చ కొనసాగుతూనే ఉంది. నవంబర్ 1 నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థ
ఏబీవీపీ


కరీంనగర్, 29 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్

బకాయిలపై రచ్చ కొనసాగుతూనే ఉంది. నవంబర్ 1 నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, స్కాలర్షిప్స్ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోగా ఇరు పక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసుల అరెస్ట్ చేసిన స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande