మేడారం మహాజాతరలో భక్తులకు తీరనున్న కష్టాలు
ములుగు, 29 అక్టోబర్ (హి.స.) ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణాకోసం అధికారులు రోడ్డు పనులు చేపట్టారు. వచ్చే ఏడాది జరిగే మహాజాతరకు శాశ్వతంగా పనులు చేపడుతున్నారు, ఈక్రమంలో గద్దెల నుంచి జంప
మేడారం జాతర


ములుగు, 29 అక్టోబర్ (హి.స.) ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణాకోసం అధికారులు రోడ్డు పనులు చేపట్టారు. వచ్చే ఏడాది జరిగే మహాజాతరకు శాశ్వతంగా పనులు చేపడుతున్నారు, ఈక్రమంలో గద్దెల నుంచి జంపన్న వాగు వరకు రోడ్డువెడల్పు పనులు చేపట్టారు. మూడు రోజులుగా ఈ పనులు చేస్తున్నారు. రోడ్డుకు ఒక వైపున జేసీబీలతో కందకాలు తీసి మట్టిపోసి రోలర్ తో చదును చేస్తున్నారు. మేడారం దేవతల దర్శనానికి వస్తున్న భక్తులు రోడ్ల పనులను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రధాన రోడ్డు వెడల్పు చేసే పనులకు మోక్షం కలిగిందంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande