
పెద్దపల్లి, 29 అక్టోబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని కనకదుర్గ రైస్మిల్లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. మిల్లో పనిచేస్తున్న సమయంలో బాయిలర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మిల్ యాజమాన్యం తక్షణమే కరీంనగర్లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సుల్తానాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియరాలేదు. బాయిలర్ పగలడానికి సాంకేతిక లోపమా లేదా నిర్లక్ష్యమా అన్న దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు