
వరంగల్, 29 అక్టోబర్ (హి.స.)
పోలీస్ అమరవీరుల సంస్మరణ
దినోత్సవాన్ని నిర్వహించిన సైకిల్ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్
చాహాత్ బాజ్ పాయి, ఎన్.డి.పి సి.ఎల్ సి యం డి వరుణ్ రెడ్డి, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ పాల్గొన్న ఈ ర్యాలీకి అదనపు డిసిపిలు రవి, సురేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సైకిలింగ్ రైడర్స్ తో కల్సి పోలీస్ అమర వీరులకు జోహర్లు నినాదాలు చేస్తు ఉత్సహపర్చారు.
అనంతరం ఈ సైకిల్ ర్యాలీ పాల్గొన్న సైకిల్ రైడర్లకు పోలీస్ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికేట్లను ప్రధానం చేసారు. ప్రతి రోజు సైకిలింగ్ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా వుండటంతో పాటు, రోజంతా ఉత్సాహంగా తమ విధుల్లో రాణించవచ్చని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరు సైకిలింగ్ కోసం కొద్ది సమయాన్ని కేటాయించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..