దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం.. పాక్‌ గూఢచారి అరెస్ట్‌
ఢిల్లీ, 29 అక్టోబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో సంచలనం చోటుచేసుకుంది. పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు కలిగిన అణు గూఢచార్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఢిల్
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం.. పాక్‌ గూఢచారి అరెస్ట్‌


ఢిల్లీ, 29 అక్టోబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో సంచలనం చోటుచేసుకుంది. పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు కలిగిన అణు గూఢచార్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ 59 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ హుస్సైనీ (Mohammed Adil Husseini) అలియాస్ సయ్యద్ ఆదిల్ హుస్సైన్, నసీముద్దీన్, సయ్యద్ ఆదిల్ హుస్సైనీని గూఢచార్యం, నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌లో పాల్గొన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.

నిందితుడు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ (AEOI), ఓ రష్యన్ అణు నిపుణుడితో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా‌నగర్ నివాసి అయిన హుస్సైనీ, తన సోదరుడితో కలిసి శాస్త్రవేత్తగా మారువేషంలో భారతదేశ అగ్రగామి అణు సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో చొరబడేందుకు యత్నించాడు. విచారణలో భాగంగా హుస్సైనీ రష్యన్ మూలానికి చెందిన శాస్త్రవేత్త నుంచి అణు సంబంధిత డిజైన్‌లను సేకరించి ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ (AEOI)కు చెందిన ఇరానియన్ ఏజెంట్‌కు అమ్మినట్లుగా ఒప్పుకున్నాడు. అయితే, ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande