తుపాను వేళ డ్యూటీ చేయకుండా వెళ్లిన నలుగురు సిబ్బంది పై సస్పెన్షన్ వేటు
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)మొంథా తుపాను (storm) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. వాతావరణ శాఖ అలర్ట్ (Meteorological department alert) కారనంగా ముందస్తుగానే ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా అన్ని శాఖల అధిక
File


అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)మొంథా తుపాను (storm) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. వాతావరణ శాఖ అలర్ట్ (Meteorological department alert) కారనంగా ముందస్తుగానే ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా అన్ని శాఖల అధికారుల సెలవులను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు మొంథా తుపానుపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేశారు. కానీ మన్యం జిల్లాలో మాత్రం నలుగురు అధికారులు.. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా.. ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఆ నలుగురు అధికారులపై సస్పెన్షన్ (Four officers suspended) వేటు వేసింది.

వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం పెదభోగిల సెక్రటేరియట్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను, మొంథా తుపాన్ కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉన్న సమయంలో విధులు నిర్వర్తించకుండా సెక్రటేరియట్‌ను విడిచిపెట్టి ఇంటికి వెళ్లినందుకు జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ (suspend) అయిన వారిలో డిజిటల్ అసిస్టెంట్ బి. శంకరరావు, మహిళా సంక్షేమ సహాయకురాలు జి.సుమతి, ఆరోగ్య సహాయకురాలు జి. జానకి, మహిళా పోలీస్ ఆర్. అప్పలనరసమ్మ ఉన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్వహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande