తిరుమల కొండల్లో కొత్త జీవి.. అరుదైన బల్లి జాతి గుర్తింపు
తిరుమల, 29 అక్టోబర్ (హి.స.) శేషాచలం అడవులు మరో అరుదైన జీవికి నిలయంగా నిలిచాయి. తిరుమల కొండల్లోని దట్టమైన చందనపు అడవిలో శాస్త్రవేత్తలు సరికొత్త బల్లి జాతిని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఈ జీవిని గుర్తించారు. తిరుమల శ్
తిరుమల


తిరుమల, 29 అక్టోబర్ (హి.స.)

శేషాచలం అడవులు మరో అరుదైన జీవికి నిలయంగా నిలిచాయి. తిరుమల కొండల్లోని దట్టమైన చందనపు అడవిలో శాస్త్రవేత్తలు సరికొత్త బల్లి జాతిని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఈ జీవిని గుర్తించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ దీనికి ‘వెంకటాద్రి స్లెండర్ గెక్కో’ అని పేరు పెట్టారు.

ఈ కొత్త బల్లి జాతి పలుచగా, తొండను పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. చందనపు చెట్టు బెరడు కింద నివసిస్తున్న సమయంలో దీనిని గుర్తించినట్లు వారు వివరించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘హెర్పటోజోవా’లో ప్రచురించారు.

ఈ కీలక పరిశోధనలో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్రెష్‌వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్, కోల్‌కతాలోని రెప్లిల్లా విభాగం, ఒడిసాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. శేషాచలం అడవుల జీవవైవిధ్యానికి ఈ కొత్త ఆవిష్కరణ మరో నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande