
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ,29, అక్టోబర్ (హి.స.) .cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 53 ఏళ్ల తర్వాత తొలిసారి కృత్రిమ వర్షం కోసం స్థానిక ప్రభుత్వం మంగళవారం ప్రయత్నించింది. అయితే నగరంలో ఎక్కడా వర్షపాతం నమోదుకాలేదని వాతావరణ విభాగం తెలిపింది. దిల్లీ ప్రభుత్వం మాత్రం రెండు చోట్ల చిరుజల్లులు పడ్డాయని, మేఘమథనం నిర్వహించిన చోట్ల గాల్లో కాలుష్యకారక రేణువులు తగ్గాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఐఐటీ కాన్పుర్ సాయంతో మేఘమథనం ప్రక్రియను దిల్లీ ప్రభుత్వం నిర్వహించింది. మంగళవారం రెండు విడతల్లో ఇది సాగింది. ఇందులో భాగంగా ప్రత్యేక సెస్నా విమానం ద్వారా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్, బాణసంచా పదార్థాలతో రూపొందించిన మిశ్రమాన్ని జ్వాలల ద్వారా మేఘాల్లోకి విడుదల చేశారు. తొలుత ఈ లోహ విహంగం కాన్పుర్ నుంచి బయల్దేరి దిల్లీలోని బురారి, ఉత్తర కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాలపై సంచరించింది. ఈ క్రమంలో ఒక్కొక్కటి 2 నుంచి రెండున్నర కిలోల బరువున్న 8 ప్యాకెట్లను మండించడం ద్వారా సంబంధిత రసాయనాలను మేఘాల్లోకి విడుదల చేసింది. ఇది మధ్యాహ్నం 2 గంటలకల్లా పూర్తయింది. సాయంత్రం 4 గంటల సమయంలో మేరఠ్ నుంచి రెండోసారి విమానం బయల్దేరింది. అది దిల్లీ శివార్లలోని బద్లీ వంటి ప్రాంతాల్లో మేఘమథనం నిర్వహించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ