
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}దిల్లీ: 29 అక్టోబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి శుభవార్త అందించింది. 8వ వేతన సవరణ సంఘం విధివిధానాల(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు మంగళవారం ఆమోద ముద్రవేసింది. ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగుళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులాక్ ఘోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది. అవసరమైతే మధ్యంతర నివేదికలనూ అందజేస్తుంది. 2026 జనవరి 1 నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వీటివల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు 50 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షలమంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ