
చెన్నై 29 అక్టోబర్ (హి.స.)
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-family:Garamond;font-size:17pt;}.pf0{}
: తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన పరిహారాన్ని ఓ బాధితురాలు తిప్పి పంపిన వైనం చర్చనీయాంశమైంది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తరఫున మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షల చొప్పున ఈ నెల 18న జమచేశారు. మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ సొమ్మును తిప్పి పంపారు. ‘విజయ్ నేరుగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తారని వీడియో కాల్‌లో మాట్లాడారు. ముందుగా ఆర్థిక సాయం తీసుకోవాలని చెప్పారు. మాకు డబ్బు ముఖ్యం కాదు. మేం విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశాం. విజయ్ ఆహ్వానించిన సమావేశానికి వెళ్లలేదు. కానీ, మా పేరు వాడుకొని మా బంధువులు ముగ్గురు సమావేశానికి వెళ్లార’ని సంఘవి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ