హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సన్నద్ధతపై రెండ్రోజుల పాటు అధికారులతో సమీక్షించేందుకు ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar), ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సంధు శనివారం ఉదయం పాట్నా చేరుకున్నారు. తాజ్ హోటల్‌లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈసీఐ సీనియర్ అధికారులు, బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వినోద్ గుంజ్యాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 12 రాజకీయల పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయలను ఈసీఐ అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు