గత రెండేళ్లలో బిహార్‌లో 50 లక్షల మందికి ఉపాధి: ప్రధాని నరేంద్ర మోదీ
హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.) గత రెండేళ్లలో బిహార్‌ ప్రభుత్వం 50 లక్షల మంది యువత(Bihar youth)కు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. యువత సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తోందన్న
PM Modi (File Photo)


హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)

గత రెండేళ్లలో బిహార్‌ ప్రభుత్వం 50 లక్షల మంది యువత(Bihar youth)కు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. యువత సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తోందన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పాలన (RJD-Congress regime)తో పోలిస్తే నితీశ్‌ ప్రభుత్వం బిహార్ విద్యా బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచిందన్నారు. అందువల్లే నేడు బిహార్‌లోని మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డ్’ ద్వారా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్దతిస్తోందన్నారు.

20 ఏళ్ల క్రితం బిహార్‌లో విద్యావ్యవస్థపై జరిగిన విధ్వంసం వల్ల యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సి వచ్చిందని ప్రధాని అన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పు వల్ల బిహార్‌కు వలసలు ప్రధాన సమస్యగా మారాయన్నారు. వాటిని అరికట్టాలంటే రాష్ట్రంలోనే ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని.. అందుకు అనుగుణంగా నీతీశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం గత దశాబ్దంలో దేశంలో 5,000 ఐటీఐల(ITI)ను ప్రారంభించిందని.. అవి పారిశ్రామిక విద్యకు ముఖ్యమైన కేంద్రంగా మాత్రమే కాకుండా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి వర్క్‌షాప్‌లుగా కూడా పనిచేస్తున్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande