గౌహతి, 4 అక్టోబర్ (హి.స.)ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్‌ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లిన అతని మేనేజర్ సిద్ధార్థ శర్మ.. కావాలనే కుట్ర చేసి విషమిచ్చి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జుబీన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా వైద్యం అందించకుండా అతని మేనేజర్ నిర్లక్ష్యం చేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పడంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంది. దీంతో ఈ కేసును విచారించడానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు అస్సాం సీఎం ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు