అహ్మదాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
వెస్టిండీస్తో జరిగిన ఫస్ట్ టెస్టులో
ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ టెస్టులో ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో గిల్ సేన గెలుపొందింది. ఇవాళ రెండో ఇన్నింగ్స్ లో విండీస్ కుప్పకూలింది. కేవలం 146 పరుగులకే ఆలౌటైంది. మూడో రోజు ఉదయం ఆట ప్రారంభానికి ముందే ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్్స్ను డిక్లేర్ చేయడంతో.. వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది.
ఫస్ట్ సెషన్లోనే భోజన విరామ సమయానికి ముందు విండీస్ అయిదు వికెట్లను కోల్పోయింది. భారత స్పిన్నర్లు విండీస్ బ్యాటర్లకు దడపుట్టింది. స్పిన్కు అనుకూలిస్తున్న అహ్మదాబాద్ పిచ్పై రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోయారు. విండీస్ బ్యాటర్లు చాలా ఈజీగా తమ వికెట్లను సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ రెండు వికెట్లు తీసుకున్నారు. విండీస్ బ్యాటర్లలో అథనేజ్ 38, గ్రీవ్స్ 25 రన్స్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు