అమరావతి, 4 అక్టోబర్ (హి.స.)‘
. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి.. ఆటో డ్రైవర్లందరికీ రూ. 15 వేలు ఖాతాల్లో జమ చేశాం.. ఆటో డ్రైవర్లకు ఇది నిజమైన పండగ.. ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఆన్‌లైన్‌లోనే డబ్బులు జమ అవుతాయి.. చెప్పినట్లు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు.
గతంలో రోడ్ల పరిస్థితుల కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం అంతా వాహనాల మరమ్మతులకే ఖర్చయ్యేది అని గుర్తుచేశారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రోడ్లన్నీ అద్భుతంగా తయారయ్యాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం మనదే అని చెప్పారు. రూ. 33 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ మరింత పెరగాలి.. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం.. వచ్చే ఎన్నికల్లో 100 శాతం సాధించాలని అన్నారు. దసరా పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా(OG Movie) చూసారు, దసరా పండగ చేసుకున్నారు, విజయవాడ ఉత్సవం బాగా జరిగింది, ఇప్పుడు ఆటో డ్రైవర్ల పండగలో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV