మంగళగిరి మరియు కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య 6 లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ
హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.) • రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 112 కోట్లు. మంగళగిరి మరియు కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్ద రూ. 112 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను రైల్వే మం
మంగళగిరి మరియు కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య 6 లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ


హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)

• రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 112 కోట్లు.

మంగళగిరి మరియు కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్ద రూ. 112 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ ఈరోజు అనగా అక్టోబర్ 3, 2025న ఆమోదించింది. ప్రతిపాదిత ఆర్.ఓ.బి అమరావతి రాజధాని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి-16 (నేషనల్ హైవే-16) మధ్య అనుసంధాన రహదారిపై ఉంది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జోన్ ద్వారా 100 శాతం రైల్వే వ్యయంతో అమలు చేయబడుతుంది.

E13 స్థానం కీలకమైన ప్రదేశంలో ఉండి ఎన్.ఎచ్-16 ను అమరావతి రాజధానితో కలుపుతుంది మరియు మధ్యలో ఒక వైపు రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ చెన్నై - హౌరాను విజయవాడ మీదుగా కలిపే ముఖ్యమైన రద్దీ రైల్వే లైన్. ప్రారంభంలో, దీనిని నాలుగు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి కోసం ప్రణాళిక చేశారు. కానీ స్థానం మరియు భవిష్యత్తు ట్రాఫిక్ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, 6లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. టెండరింగ్ ప్రక్రియకు మారే ముందు డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి ప్రాథమిక పనులు త్వరలో పూర్తవుతాయి.

ప్రతిపాదిత రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతం వైపు వెళ్లే రోడ్డు ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది రోడ్డు మరియు రైలు వినియోగదారుల భద్రతను నిర్ధారిస్తూ నిలుపుదలలను నివారించి రవాణాను సజావుగా సులభతరం చేస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande