హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన దళిత విద్యార్థి చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని డల్లాస్ కు ఇటీవల వెళ్లగా, శనివారం తెల్లవారుజామున దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందడం తీవ్ర బాధాకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
ఉన్నత విద్యనభ్యసించి గొప్పగా స్థిరపడతానుకున్న తమ కుమారుడు ఇక లేడని తెలిసి చంద్రశేఖర్ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన పూడ్చలేనిదని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత విద్యార్థి చంద్రశేఖర్ తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులకు ఎంపీ రవిచంద్ర తీవ్ర సంతాపం తెలిపారు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ భౌతికకాయాన్ని వీలైనంత తొందరగా హైదరాబాద్ కు రప్పించేలా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు