ఢిల్లీ, 4 అక్టోబర్ (హి.స.)
: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ.. పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు