తెలంగాణ, ఖమ్మం. 4 అక్టోబర్ (హి.స.)
ఈ నెల 23న జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్స్ పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదేశాలు ఇచ్చారు. శనివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని, మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఆర్వోస్, నామినేషన్ పత్రాలను పరిశీలించారు. అనంతరం శ్రీజ మాట్లాడుతూ...ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన పలు కీలక సూచనలు చేశారు. ఎంపీడీవో షేక్. సిలార్ సాహెబ్, సూపరింటెండెంట్ శారదా దేవి, సీనియర్ అసిస్టెంట్ మీరా, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు