తెలంగాణ, నల్గొండ. 4 అక్టోబర్ (హి.స.)
ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 నుండి 12వ తేదీ వరకు మానసిక ఆరోగ్యం- శ్రేయస్సుపై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదో రకంగా మానసికంగా బాధపడుతున్నారని, మరికొందరు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. అయినప్పటికీ మనం ఈ సమస్యను పక్కన పెడుతున్నామని, మానసిక ఒత్తిడి తగ్గాలంటే జీవన విధానం మార్చుకోవాలని, స్మార్ట్ ఫోన్ వాడకంను సాధ్యమైనంతగా తగ్గించాలని, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు