తెలంగాణ, సూర్యాపేట. 4 అక్టోబర్ (హి.స.)
మాజీ మంత్రి, తుంగతుర్తి మాజీ
ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహం శనివారం ఉదయం రెండు గంటల ప్రాంతంలో తుంగతుర్తి లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు తెల్లవారుజాము నుండే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహతో పాటు వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై దామోదర్ రెడ్డి పార్దివ దేహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు