ముంబై, 4 అక్టోబర్ (హి.స.)
గత 8 రోజులు నష్టాలతో తల్లడిల్లిన షేర్ మార్కెట్ ఆర్బీఐ టానిక్కుతో మళ్లీ పుంజుకుంది. ఆర్బీఐ రెపో రేట్ యథాతథం, గ్లోబల్ క్యూస్ ప్రభావంతో క్షీణత్వం వెంటాడినా .. మెటల్స్, బ్యాంకింగ్, ఐటీ సెక్టర్లు వెనక్కి తగ్గలేదు. మొత్తం మీద మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ సినారియో ప్రదర్శించింది. స్టాక్ -స్పెసిఫిక్ ట్రేడింగ్ డామినేట్ చేసింది. ఫలితంగా షేర్ మార్కెట్ రూ.4.63 లక్షల లాభాన్ని తన ఖాతాలో వేసుకుంది.సెప్టెంబర్ 29న 24,634.90 పాయింట్లతో ముగిసిన నిఫ్టీ అక్టోబర్ 3 నాటికి 24,894.25 పాయింట్లకు చేరింది. అంటే 259.35 పాయింట్లు పెరిగాయి ఇక సెన్సెక్స్ 80,364.94 పాయింట్ల నుండి 81,207.17 కి ఎగబాకింది. ----
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు