తెలంగాణ, సూర్యాపేట. 4 అక్టోబర్ (హి.స.)
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, తాసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సహజ కాన్పులు అయ్యే విధంగా గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు అందుతున్న సేవల గురించి డాక్టర్ నగేశ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అలాగే తాసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి వివిధ రకాల సర్టిఫికెట్లు, సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తాసీల్దార్ శ్రీకాంత్కు సూచించారు. ఆయన వెంట మాధవి, అనూష, వైద్య సిబ్బంది ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు