అమరావతి, 5 అక్టోబర్ (హి.స.)
కుప్పం, : కర్ణాటక- ఆంధ్రప్రదేశ్- తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చకచకా సాగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే చిత్తూరు జిల్లా నుంచి కేవలం గంటన్నర వ్యవధిలోనే ఇటు బెంగళూరుకు.. అటు చెన్నై చేరుకోవచ్చు. వి.కోట నుంచి అయితే గంటలోనే బెంగళూరు వెళ్లొచ్చు. గరిష్ఠ ప్రయాణ వేగం 120 కి.మీ.
కర్ణాటకలో రయ్‌రయ్... కర్ణాటక పరిధి హొస్‌కోట నుంచి సుందరపాళ్య వరకు 91 కి.మీ. నాలుగు వరుసల హైవే పూర్తితో రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సుందరపాళ్య నుంచి తమిళనాడు సరిహద్దు గుడిపాల వరకు పనులు చేస్తున్నారు. బైరెడ్డిపల్లె, గుడిపాల సమీప చీలాపల్లె, బంగారుపాళ్యం సమీప బలిజపల్లె వద్ద లింకు రహదారులు నిర్మిస్తున్నారు.
భవిష్యత్తులో ఎనిమిది వరుసలు... వచ్చే ఏడాది ఆఖరికి 3 రాష్ట్రాల పరిధిలో ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలు సాగించే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో రద్దీని అనుసరించి 8 వరుసలుగా అభివృద్ధికి కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ