హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉంటే వీటిలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తున్నాయని మిగిలిన 50 శాతం రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) మేనేజ్మెంట్ కోటాగా కింద ఉన్నాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..