అమరావతి, 5 అక్టోబర్ (హి.స.)
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో ఒక్కసారిగా టమాటా ధరలు పతనమయ్యాయి. కిలో ధర రూపాయికి పడిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు... టమాటాలు రోడ్డుపై పారబోసి ఆందోళనకు దిగారు. దీంతో గుత్తి- మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ