హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ పై చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయాన్ని చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..