నాగార్జునసాగర్ లో పర్యాటకుల సందడి
తెలంగాణ, నాగార్జునసాగర్. 5 అక్టోబర్ (హి.స.) నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరదనీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి, అధికారులు 2,03,788 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 590 అడుగ
సాగర్


తెలంగాణ, నాగార్జునసాగర్. 5 అక్టోబర్ (హి.స.)

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి

వరదనీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి, అధికారులు 2,03,788 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.50 అడుగుల వద్ద నిల్వ ఉంది. గరిష్ట నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 305.81 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,657 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదనంగా కుడికాల్వకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,718 క్యూసెక్కులు, ఎస్.ఎల్.బీ.సీ. ద్వారా 2,400 క్యూసెక్కులు, లో లెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande