ఐటీ ఐ.పరీక్షల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు
న్యూఢిల్లీ, 5 అక్టోబర్ (హి.స.) ,:ఐటీఐ పరీక్షల్లో.. తెలుగు రాష్ట్రాల విద్యారు ్థలు సత్తా చాటారు.. శనివారం, న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ లో జరిగిన కౌశల్‌ దీక్షాంత్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఐటీఐ ట్రేడ్‌ టెస్ట్‌లలో టాపర్లుగా నిలిచిన 45 మం
ఐటీ ఐ.పరీక్షల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు


న్యూఢిల్లీ, 5 అక్టోబర్ (హి.స.)

,:ఐటీఐ పరీక్షల్లో.. తెలుగు రాష్ట్రాల విద్యారు ్థలు సత్తా చాటారు.. శనివారం, న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ లో జరిగిన కౌశల్‌ దీక్షాంత్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ఐటీఐ ట్రేడ్‌ టెస్ట్‌లలో టాపర్లుగా నిలిచిన 45 మంది విద్యార్థులను సత్కరించారు. వీరిలో ఆర్టిఫిషియ ల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచిన ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన తాళ్లూరు పల్లవి ప్రధాని మోదీ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఏపీలోని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరానికి చెందిన పాంగి మధులత (రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌) మొత్తం 1,200 మార్కులకుగాను 1,194 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమెతోపాటు డి.వందన(పెయింటర్‌ జనరల్‌), ఎస్‌.యామిని వరలక్ష్మి(వుడ్‌వర్క్‌ టెక్నీషియన్‌)కు ప్రధాని మోదీ సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీకి సంబంధించి మొత్తం 17 మంది జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande